mi vaatsaap akountloni vidiyolanu daacheyaalante..?


మీ వాట్సాప్ అకౌంట్ గ్యాలరీలోని ఫోటోలు ఇంకా వీడియోలను ఎవరికి కనిపించకుండా దాచేయలనుకుంటున్నారా..? యాప్ లాక్ పేరుతో ఓ అప్లికేషన్ అందుబాటులో ఉన్నప్పటికి ఫోటోలు ఇంకా వీడియోలు గ్యాలరీలో కనిపిస్తూనే ఉంటాయి. గ్యాలరీని మొత్తం లాక్ చేసేందుకు గ్యాలరీ లాక్ అందుబాటులో ఉన్నప్పటికి అంతగా శేయస్కరం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి..? మీ వాట్సాప్ అకౌంట్ గ్యాలరీని లాక్ చేయటం కన్నా హైడ్ చేయటం ద్వారా ఎక్కువ సెక్యూరిటీని పొందవచ్చు. మరో ఆసక్తికర విషయమేమింటే మీ వాట్స్‌వాప్ గ్యాలరీని హైడ్ చేసేందుకు ఏ విధమైన థర్డ్ పార్టీ యాప్ సహకారం అవసరం లేదు. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి వాట్సాప్ డైరక్టరీని మీ ఫోన్ ఎస్‌డీ కార్డ్‌లోకి యాక్సెస్ చేసుకునేందుకు ఓ ఫైల్ మేనేజర్ యాప్ అవసరమవుతుంది. మీ ఫోన్‌లో ఏ విధమైన ఫైల్ మేనేజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసి లేనట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ES File Exploreను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ES File Explore యాప్‌ను ఓపెన్ చేయండి. ఆ తరువాత వాట్సాప్ మీడియా ఫోల్డర్‌కు నావిగేట్ అవ్వండి. Home > sdcard > WhatsApp > Media. మీడియా ఫోల్డర్ క్రింద 'WhatsApp Images' పేరుతో సబ్ ఫోల్డర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫోల్డర్ పేరను '.WhatsApp Images'గా మార్చండి. ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఎదైనా ఫోల్డర్‌కు రీనేమ్ చేయాలంటే ఆ ఫోల్డర్ పై లాంగ్ ప్రెస్ చేసినట్లయితే రీనేమ్ ఆప్షన్ స్ర్కీన్ క్రింది భాగంలో ప్రతక్షమవుతుంది. రీనేమ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీరు వాట్సాప్ గ్యాలరీలోకి వెళ్లండి. ఏ విధమైన వాట్సాప్ ఫోటోలుగానీ, వీడియోలు గానీ మీకు కనిపించవు. హైడ్ కాబడిన ఫోటోలు ఇంకా వీడియోలు తిరిగి కనిపించాలంటే '.WhatsApp Images' ఫోల్డర్ పేరులోని ( . ) తొలగించినట్లయితే వీడియోలు, ఫోటోలు తిరిగి వాటి స్థానాల్లోకి వచ్చేస్తాయి. ఈ సింపుల్ ట్రిక్‌ను ప్రదర్శించటం ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ల‌లోని గ్యాలరీలను ఎవరికంటా పడకుండా భద్రంగా హైడ్ చేసుకోవచ్చు.